వెలయునిన్నియును వృధా వృధా-Velayunanniyuu vrudha vrudha-Annamayya sankeerthanam
వెలయునిన్నియును వృధా వృధా
॥పల్లవి॥
|
వెలయునిన్నియును
వృధా వృధా
తలఁపున శ్రీహరిఁ దడసినను |
|
॥చ1॥
|
ఎడయలేనిపుణ్యము
లెన్నియైనా
విడువక సేయుట వృధా వృధా బడిబడి నే శ్రీపతి నాత్మలోఁ దడవక యితరము దడవినను |
|
॥చ2॥
|
యెరవులతపముల
నెంతైనా
విరవిరవీఁగుట వృధా వృధా హరినచ్యుతుఁ బరమాత్మునిని మరచి తలఁచక మఱచినను |
|
॥చ3॥
|
దైవము
నెఱఁగక తమకమున
వేవేలైన వృధా వృధా శ్రీవేంకటగిరిచెలువునిని సేవించక మతిఁ జెదరినను |
Comments
Post a Comment