జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి పద్యo
పుట్టబోయేటి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుపు గిన్నెకు పాలు పోసి పోసీ............//2//
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకులతికి అతికీ........
పూల గంధాలలో రోలంబములకు
రేపటి భోజనము సిద్ధపరచి పరచీ.....।
తెలవారకుండా మొగ్గలలోన జొరబడి
వింత వింతల రంగు వేసి వేసి.....।।2।।
తీరికే లేని విశ్వ సంసారమందు
అలసి పోయితివేమో
దేవాది దేవా....దేవాది దేవా..।।।
ఒక్క నిమిషము కను మూయుదువు కాని రమ్ము । రమ్మూ....।।।।।
పొదుపు గిన్నెకు పాలు పోసి పోసీ............//2//
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకులతికి అతికీ........
పూల గంధాలలో రోలంబములకు
రేపటి భోజనము సిద్ధపరచి పరచీ.....।
తెలవారకుండా మొగ్గలలోన జొరబడి
వింత వింతల రంగు వేసి వేసి.....।।2।।
తీరికే లేని విశ్వ సంసారమందు
అలసి పోయితివేమో
దేవాది దేవా....దేవాది దేవా..।।।
ఒక్క నిమిషము కను మూయుదువు కాని రమ్ము । రమ్మూ....।।।।।
తెరచితి మా కుటీరమ్ము తలుపు!!
కూర్చుండ మాయింట కురిచీలు లేవు
నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి ………..
పాద్యమ్ము నిడ మాకు పన్నీరులేదు
నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి………………….
పూజకై మావీట పుష్పాలు లేవు
నా ప్రేమాంజలులె సమర్పింపనుంటి ………….
నైవేద్యమిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి ……………….
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము……. దయసేయు మాత్మపీఠమ్ముపైకి……..
అమృతఝురి చిందు నీ పదాంకములయందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి…………..
Comments
Post a Comment