ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి
॥పల్లవి॥
|
ఏ
కులజుఁడేమి యెవ్వఁడైననేమి
ఆకడ నాఁతడె హరి నెఱిగిన వాఁడు |
|
॥చ1॥
|
పరగినసత్యసంపన్నుఁడైనవాఁడే
పరనిందసేయఁ దత్పరుఁడుగాని వాఁడు అరుదైన భూతదయానిధియగువాఁడే పరులుదానేయని భావించు వాఁడు |
|
॥చ2॥
|
నిర్మలుఁడై
యాత్మనియతి గలుగువాఁడే
ధర్మతత్పరబుధ్ధిఁ దగిలిన వాఁడు కర్మమార్గములు గడవనివాఁడే మర్మమై హరిభక్తి మఱవని వాఁడు |
|
॥చ3॥
|
జగతిపై
హితముగాఁ జరియించు
వాఁడే
పగలేక మతిలోన బ్రతికిన వాఁడు తెగి సకలము నాత్మ దెలిసివాఁడే తగిలి వేంకటేశుదాసుఁడయిన వాఁడు |
Comments
Post a Comment