నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప-Nigama nigamantha varnitha-Annamyya keerthan
నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప
॥పల్లవి॥
|
నిగమనిగమాంత
వర్ణిత మనోహర
రూప
నగరాజధరుఁడ శ్రీనారాయణా |
|
॥చ1॥
|
దీపించు
వైరాగ్య దివ్యసౌఖ్యం
బియ్య-
నోపకకదా నన్ను నొడఁబరుపుచు పైపైనె సంసారబంధములఁ గట్టేవు నాపలుకు చెల్లునా నారయణా |
|
॥చ2॥
|
చీకాకు
పడిన నాచిత్తశాంతము
సేయ-
లేకకా నీవు బహులీల నన్ను కాకుసేసెదవు బహుకర్మములఁ బడువారు నాకొలఁదివారలా నారాయణా |
|
॥చ3॥
|
వివిదనిర్బంధముల
వెడలఁద్రోయక నన్ను
భవసాగరములఁ దడఁబడఁ జేతురా దివిజేంద్రవంద్య శ్రీతిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీనారాయణా |
Comments
Post a Comment