చిత్తమో కర్మమో జీవుఁడో దేవుఁడో
॥పల్లవి॥
|
చిత్తమో
కర్మమో జీవుఁడో
దేవుఁడో
వొత్తిన యీచేఁత లొకరివి గావు |
|
॥చ1॥
|
పదిలమైన
మోహపాశంబులు దెచ్చి
మెదలకుండఁగ నాకు మెడఁజుట్టి యెదిరివారు నవ్వ నింటింటఁ దిరిగించి తుదలేని యాసల దు: ఖాతురునిఁ జేసె |
|
॥చ2॥
|
కొలఁదిమీఱ
జన్మకోట్లఁ బెనగొని
తొలఁగని నాలోని దురితము తొలఁగింప నాలుక తుదకు నీపేరిచ్చి తెలుపు మింతియ చాలుఁ దిరువేంకటేశా |
Comments
Post a Comment