చాలదా మా జన్మము నీ-
చాలదా మా జన్మము నీ-
॥పల్లవి॥
|
చాలదా
మా జన్మము
నీ-
పాలింటివారమై బ్రతుకఁగఁ గలిగె |
|
॥చ1॥
|
కమలాసనాదులు
గానని నీపై
మమకారము సేయ మార్గము గలిగె అమరేంద్రాదుల కందరాని నీ- కొమరైన నామము కొనియాడఁ గలిగె |
|
॥చ2॥
|
సనకాదులును
గానఁజాలని నిన్నుఁ
తనివోవ మతిలోనఁ దలపోయఁ గలిగె ఘనమునీంద్రులకు నగమ్యమైవున్న- నిను సంతతమును వర్ణింపఁగలిగె |
|
॥చ3॥
|
పరమమై
భవ్యమై పరిగిననీ-
యిరవిట్టిదని మాకు నెఱుఁగంగఁ గలిగె తిరువేంకటాచలాధిప నిన్ను యీ- ధరమీఁదఁ బలుమారు దరిసింపఁ గలిగె |
Comments
Post a Comment