ముద్దుగారే యశోద ముంగిటి-mUDDU GARE yASHODA
ముద్దుగారే యశోద ముంగిటి
॥పల్లవి॥
|
ముద్దుగారే
యశోద ముంగిటి
ముత్యము వీఁడు
తిద్దరాని మహిమల దేవకిసుతుఁడు |
|
॥చ1॥
|
అంతనింత
గొల్లెతల అరచేతి
మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూఁడులోకాల గరుడపచ్చఁబూస చెంతల మాలోనున్న చిన్నికృష్ణుఁడు |
|
॥చ2॥
|
రతికేలి
రుక్మిణికి రంగు
మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ముఁ గాచేటి కమలాక్షుఁడు |
|
॥చ3॥
|
కాళింగుని
తలల పైఁ
గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము పాలజలనిధిలోనఁ బాయని దివ్యరత్నము బాలుని వలెఁ దిరిగీఁ బద్మనాభుఁడు |
Comments
Post a Comment