రాయినైనా కాకపోతిని రామపాదము శోకగా


చిత్రం: గోరంతదీపం
 సంగీతం: కె.వి. మహదేవన్
 రచన: ఆరుద్ర
గానం: సుశీల
Pallavi:
రాయినైనా కాకపోతిని రామపాదము శోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యము రాయగా…2…..
 పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా,…..2……..
 పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యమునేలగా || రాయినైనా ||

Charanam:1
 అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా,అ౦దువలనా రామచ౦ద్రుని అమిత కరుణను నోచనా …2……
కడలిగట్టున ఉడుతనైతే     ఉడతసాయము చేయనా, …2…
కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా || రాయినైనా ||

Charanam:2

 కాకినైనా కాకపోతిని ఘాతుకముగావి౦చుచూ, గడ్డిపోచను శరముచెసి ఘనత రాముడు చూపగా ….2…..
మహిని మూగాజీవులే     మహిమలన్నీ నోచగా, ….2…..
మనిషినై జన్మించినాను మత్సరాలే పె౦చగా || రాయినైనా ||

Comments

Popular posts from this blog

Saranu saranu Surendra sannutha

kurai ondrum illai marai moorthy kannas

Innastu Bekenna Hrudayakke Rama